సుప్రీంలో యూపీ ప్రభుత్వానికి షాక్‌

న్యూఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది.హోర్డింగ్‌లను తొలగించాలని అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. ప్రభుత్వ అప్పీలు పై  జస్టిస్‌ లలిత్‌, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.  డిసెంబర్‌లో జరిగిన సీఏఏ వ్యతిరేక అల్లర్లలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న 53 మంది ఫోటోలు, వారి వివరాలతో హోర్డింగ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.







రాష్ట్ర ప్రభుత్వానికి హోర్డింగ్‌లు ఏర్పాటు చేసే అధికారం ఉందా అని జస్టిస్‌ లలిత్‌ ప్రశ్నించారు. ప్రభుత్వాలకు తప్పు చేసే వారిపై చట్టపరంగా చర్య తీసుకునే అధికారం ఉందంటూ సుప్రీం కోర్టు తెలిపింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మె‍హతా వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి హోర్డింగ్‌లను తొలగించడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదని, అయితే నిరసన సమయంలో తుపాకీలను ప్రయోగించే హక్కు లేదని మె‍హతా తెలిపారు. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలన్న యూపీ ప్రభుత్వ వాదనను సుప్రీం నిరాకరిస్తు..వచ్చే వారం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య  ధర్మాసనం విచారిస్తుందని సుప్రీం బెంచ్‌ పేర్కొంది.